రాష్ట్ర సమాచార కమిషనర్ పై దేవాదాయ శాఖ అధికారులు. రిట్ పిటిషన్.దాఖలు
అమరావతి, 23 మార్చి (హి.స.)రాష్ట్ర సమాచార సమాచార కమిషనర్పై దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దేవదాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితా, పదోన్నతులకు సంబంధించిన నోట్ఫైల్ కావాలని అదే శాఖకు చెందిన ఓ ఉద్యోగి సమాచార హక్క
రాష్ట్ర సమాచార  కమిషనర్ పై దేవాదాయ శాఖ అధికారులు. రిట్ పిటిషన్.దాఖలు


అమరావతి, 23 మార్చి (హి.స.)రాష్ట్ర సమాచార సమాచార కమిషనర్పై దేవాదాయ శాఖ అధికారులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దేవదాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్ల సీనియారిటీ జాబితా, పదోన్నతులకు సంబంధించిన నోట్ఫైల్ కావాలని అదే శాఖకు చెందిన ఓ ఉద్యోగి సమాచార హక్కు చట్టం ద్వారా కోరారు. సాధారణంగా ఇది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి స్థాయిలో ఇచ్చే సమాచారమే. కానీ దేవదాయ శాఖ అధికారులు మాత్రం అడిగిన సమాచారం ఇచ్చేది లేదని సదరు ఉద్యోగికి స్పష్టం చేశారు.

దీంతో ఆయన ఫస్ట్ అపిలేట్ ఆథారిటీని సంప్రదించారు. అయినా ఫలితం లేకపోవడంతో విషయం ఆర్టీఐ కమిషనర్ కోర్టులోకి చేరింది. ఉద్యోగి కోరిన సమాచారం ఆర్టీఐ నిబంధనల మినహాయింపులోకి వచ్చేది కాదని, ఆ వివరాలు వెంటనే ఇవ్వాలని ఆర్టీఐ కమిషనర్ మొదటి విచారణలోనే ఆదేశించారు. దీనిపై దేవదాయ శాఖ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి స్పందించి.. సమాచారం ఇవ్వడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ శాఖలో ఎస్టాబ్లి్ష్మెంట్ అధికారులు సహకరించడం లేదని చెప్పారు. దీంతో ఎస్టాబ్లి్ష్మెంట్ అధికారులు రెండో విచారణకు వచ్చి వివరణ ఇవ్వాలని ఆర్టీఐ కమిషనర్ ఆదేశించారు. దీంతో విచారణకు హాజరైన అధికారులు సీనియారిటీ జాబితా, నోట్ఫైళ్లను ఇవ్వొద్దని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశించడంతోనే సమాచారం ఇవ్వడం లేదని ఆర్టీఐ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్టీఐ పరిధిలోకి వచ్చే ఏ సమాచారాన్ని అయినా దరఖాస్తుదారులకు ఇవ్వాల్సిందేనని, దీనిని ఎవ్వరూ ఆపడానికి లేదని, సదరు ఉద్యోగి అడిగిన సమాచారం వెంటనే ఇవ్వాలని ఆర్టీఐ కమిషనర్ మరోసారి సూచించారు. రెండుసార్లు జరిగిన విచారణలోనూ దేవదాయ శాఖ అధికారులు ఆర్టీఐ కమిషనర్ ఆదేశాలను పాటించలేదు. సదరు ఉద్యోగికి సమాచారం ఇవ్వనేలేదు. మూడోసారి విచారణకు హాజరైన దేవదాయ శాఖ అధికారులు.. సమాచారం ఇవ్వడానికి కమిషనర్ ఆంగీకరించడం లేదని, ఆ వివరాలు ఇవ్వలేమని స్పష్టం చేశారు.

దీంతో సెక్షన్ 5, 7 పక్రారం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారిని ఎవరూ ప్రభావితం చేయడానికి లేదని, వారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే వాతావరణం కల్పించాలని ఆర్టీఐ కమిషనర్ తెలిపారు. దేవదాయ శాఖలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయని, ఆర్టీఐ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకించినా, అడ్డుకున్నా, చివరికి ఆలస్యం చేసినా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగి కోరిన సీనియారిటీ జాబితాతో పాటు నోట్ఫైల్ వెంటనే ఇవ్వాలని మరోసారి ఆదేశించారు. లేకుంటే సెక్షన్ 20 కింద దేవదాయ శాఖ కమిషనర్కు జరిమానా విధించడంతో పాటు ఆయనపై చర్యలకు ఆదేశిస్తామని హెచ్చరించారు. దీంతో ఆర్టీఐ కమిషనర్పై దేవదాయ శాఖ అధికారులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీఐ కమిషనర్ ఆదేశం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని, సమాచార హక్కు చట్టం ప్రకారం మినహాయింపు ఉన్న సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తున్నారని, దీనిపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ వారంలో దీనిపై హైకోర్టులో విచారణ జరగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande