అసెంబ్లీ ఎన్నికల వేళ అస్సాంలో బీజేపీకి ఎదురుదెబ్బ.. పార్టీకి కీలక మంత్రి రాజీనామా
అస్సాం, 23 మార్చి (హి.స.)అసెంబ్లీ ఎన్నికల వేళ అస్సాంలో అధికార బీజేపీ (BJP)కి ఊహించని షాక్ తగిలింది. హాఫ్లాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నందిత గొర్లోస (Nandita Gorlosa) పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదే
Assam BJP


అస్సాం, 23 మార్చి (హి.స.)అసెంబ్లీ ఎన్నికల వేళ అస్సాంలో అధికార బీజేపీ (BJP)కి ఊహించని షాక్ తగిలింది. హాఫ్లాంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నందిత గొర్లోస (Nandita Gorlosa) పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరుతూ ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి లేఖ రాశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆమెకు టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలో కొత్త అభ్యర్థిగా రూపాలీ లాంగ్ధాసా ప్రకటించడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. బీజేపీని వీడిన నందిత గొర్లోసా కొద్దిసేపటికే ఆమె కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరారు. అయితే ఆమె నుంచి ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది. తాను భారతీయ జనతా పార్టీ (BJP) ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నానని నందిత గొర్లోసా లేఖలో వెల్లడించారు. పార్టీలో తనకు లభించిన అవకాశాలకు, ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande