ఎర్రకోట పేలుడు కేసు: హంద్వారాలో ఎన్ఐఏ సోదాలు.. 11కు చేరిన అరెస్ట్ల సంఖ్య
ఢిల్లీ, 23 మార్చి (హి.స.) 2025 లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం జమ్మూ కాశ్మీ
red-fort


ఢిల్లీ, 23 మార్చి (హి.స.) 2025 లో ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. కాగా ఈ పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరోసారి ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం జమ్మూ కాశ్మీర్లోని హంద్వారా, గులూరా ప్రాంతంలో ఒక ప్రముఖ వ్యాపారి నివాసంపై ఎన్ఐఏ బృందాలు దాడులు నిర్వహించాయి. ప్రస్తుతం అధికారులు అక్కడ కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులకు ఆయుధాలు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్సార్ గజ్వాతుల్ హింద్ (AGH) ఉగ్రవాద సంస్థకు చెందిన ఒవర్ గ్రౌండ్ వర్కర్లు (OGW) జమీర్ అహ్మద్, తుఫైల్ అహ్మద్లను అరెస్ట్ చేయడంతో మొత్తం అరెస్టుల సంఖ్య 11కు చేరింది.

అలాగే ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ షాహీన్ సయీద్, ముఫ్తీ ఇర్ఫాన్ సహా ఏడుగురికి పాటియాలా హౌస్ కోర్టు జ్యుడీషియల్ కస్టడీని మరో 15 రోజుల పాటు పొడిగించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులను హాజరుపరచగా, స్పెషల్ జడ్జి పితాంబర్ దత్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్లో ఇటీవల జరిగిన కొన్ని నిరసనల కారణంగా దర్యాప్తుకు కొంత ఆటంకం కలిగిందని ఎన్ఐఏ కోర్టుకు తెలపడంతో, దర్యాప్తు సమయాన్ని కూడా 45 రోజుల పాటు పొడిగించారు. నవంబర్ 11, 2025న ఎర్రకోట వద్ద కారులో జరిగిన ఈ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande