కేంద్ర మంత్రి Al వాయిస్తో భారీ మోసం.. ఇన్వెస్ట్మెంట్ రాకెట్ గుట్టురట్టు చేసిన ఢిల్లీ సైబర్ పోలీసులు
న్యూఢిల్లీ, 24 మార్చి (హి.స.) కృత్రిమ మేధ (AI) సాంకేతికతను ఉపయోగించి అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఢిల్లీ సౌత్-వెస్ట్ జిల్లా సైబర్ (Delhi South-West District Cyber Police) పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి క
Delhi cyber


న్యూఢిల్లీ, 24 మార్చి (హి.స.) కృత్రిమ మేధ (AI) సాంకేతికతను

ఉపయోగించి అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను ఢిల్లీ సౌత్-వెస్ట్ జిల్లా సైబర్ (Delhi South-West District Cyber Police) పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, ముంబై నగరాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ఈ ముఠా, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి రూ.కోట్లు కొల్లగొడుతోంది. ఈ మోసం గురించి సౌత్ వెస్ట్ జిల్లా అడిషనల్ డీసీపీ అభిమన్యు పోస్వాల్ (Additional DCP Abhimanyu Poswal) కీలక వివరాలు వెల్లడించారు.

నిందితులు ఫేస్బుక్లో ఒక రిజిస్ట్రార్ లింక్ను ప్రచారం చేశారని తెలిపారు. ఇందులో కేంద్ర ఆర్థిక మంత్రి (Finance Minister) నిర్మలా సీతారామన్ ఫోటోతో పాటు ఆమె వాయిస్ను డీప్ ఫేక్ ద్వారా AI టెక్నాలజీతో మాడిఫై చేసి పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. అయితే, ఓ సీనియర్ సిటిజన్ ఈ ప్రకటనను నమ్మి తన వద్ద ఉన్న రూ.22,67,000 మొత్తాన్ని నిందితుల ఖాతాల్లోకి బదిలీ చేసి మోసపోయారని తెలిపారు. ఈ ముఠా ముఖ్యంగా ఢిల్లీ (Delhi), ముంబైలోని (Mumbai) వివిధ ప్రాంతాల నుంచి పనిచేస్తూ, సోషల్ మీడియా ద్వారా బాధితులను ఆకర్షిస్తోందని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తుల పేర్లతో వచ్చే పెట్టుబడి పథకాలను నమ్మవద్దని, ముఖ్యంగా Al ద్వారా సృష్టించిన వీడియోలు లేదా ఆడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని అడిషనల్ డీసీపీ అభిమన్యు పోస్వాల్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande