
ముంబై, 30 మార్చి (హి.స.)
దేశంలో బంగారం, వెండి ధరలు అతి స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా భారీ స్థాయిలో దిగి వస్తున్న బంగారం, వెండి ధరలతో ఎంతో ఊరట కలిగిస్తోంది. అయితే రెండు రోజులుగా మాత్రం మళ్లీ పెరుగుతోంది. ఇక మార్చి 30వ తేదీన సోమవారం మాత్రం అతి స్వల్పంగా తగ్గింది. దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,080 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,740 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.
హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,080 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,35,740 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర రూ.2,49,900 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లు, డాలర్ బలం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్లు, పారిశ్రామిక డిమాండ్, డాలర్ స్థానం, పెట్టుబడిదారుల డిమాండ్ ద్వారా బంగారం ధరలను నిర్ణయిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV