
డిల్లీ, 04 మార్చి (హి.స.)ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడి అనంతరం పశ్చిమాసియా రగులుతోంది. ఇరాన్ కూడా ప్రతి దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ ముందు నుంచీ హెచ్చరించినట్లే అమెరికా ఆస్తులే లక్ష్యంగా దాడులకు దిగుతోంది. ఇందులో భాగంగా తాజాగా గల్ఫ్‌లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు (AWS) చెందిన డేటా సెంటర్లే లక్ష్యంగా డ్రోన్లతో విరుచుకుపడింది. దీని వెనుక ఇరాన్ ముందస్తు వ్యూహం ఉందని అర్థమవుతోంది.
సాంకేతిక యుగంలో డేటా ఇంధనంలాంటిది. ‘ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్’ అని ఓ సినిమాలో డైలాగ్ కూడా ఉంది. దీన్ని గ్రహించిన ఇరాన్ గల్ఫ్‌లోని ఏడబ్ల్యూఎస్‌కు చెందిన డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుంది. తద్వారా అమెరికా వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీయాలన్న వ్యూహం కనిపిస్తోంది. ఒకవేళ తమపై అమెరికా దాడి చేస్తే వేటిని లక్ష్యంగా చేసుకోవాలన్నది ఇరాన్ వద్ద ముందు నుంచే స్పష్టమైన ప్రణాళిక ఉందని ఈ దాడులను బట్టి అర్థమవుతోంది. యూఏఈ, బహ్రెయిన్‌లోని తమ డేటా సెంటర్లపై దాడిని అమెజాన్ కూడా ధ్రువీకరించింది. దీంతో తమ కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడిందని పేర్కొంది
.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు