
న్యూఢిల్లీ, 04 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. వేలాది విమానాలు రద్దవగా.. విమానాల టికెట్ల ధరలు ఆకాశాన్నంటిన పరిస్థితి. ఈ కారణంగా పాకిస్థాన్ తమ గగన తలాన్ని మార్చి 31 వరకు పాక్షికంగా మూసివేస్తున్నట్లు నోటమ్ జారీ చేసింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. బదులుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికన్, ఇజ్రాయెల్ బేస్‌లపై ఇరాన్ దాడులు విమానయానమార్గాలను పరిమితం చేశాయి. దీంతో పలు ఎయిర్‌లైన్స్ వేలాదిగా తమ విమానాలను రద్దు చేయడమో.. మళ్లించడమో చేయాల్సి వచ్చింది. దీనికితోడు పాకిస్థాన్.. ఆఫ్ఘానిస్థాన్‌ల మధ్య సైనిక ఘర్షణల ప్రభావం కూడా విమానయాన రంగంపై పడింది. కేవలం పాక్ నుంచి పశ్చిమాసియా దేశాలకు వెళ్లే విమానాలే 300కు పైగా రద్దయ్యాయి. కాగా ఇరాన్‌పై అమెరికా దాడులు మొదలయ్యాక పశ్చిమాసియా దేశాల్లో 12,000కు పైగా విమానాలు రద్దయ్యాయి.
5
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు