ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ గా ఖమేనీ రెండవ కుమారుడు!
హైదరాబాద్, 04 మార్చి (హి.స.) ఇజ్రాయెల్-అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మోజాబా ఖమేనీ ఇరాన్ కొ
Iran leader


హైదరాబాద్, 04 మార్చి (హి.స.)

ఇజ్రాయెల్-అమెరికా వర్సెస్ ఇరాన్

మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నిక జరిగింది. ఈ నేపథ్యంలో అయతుల్లా అలీ ఖమేనీ రెండో కొడుకు మోజాబా ఖమేనీ ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇరాన్ అంతర్జాతీయ మీడియా సంస్థ కూడా అధికారికంగా వెల్లడించింది. మోజాబా ఖమేనీను ఎన్నుకోవాలని ఆ దేశ మత పెద్దలను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతని ఎన్నిక అనివార్యం అయినట్లు చెబుతున్నారు.

ఖమేనీ ప్రతి కార్యకలాపాలలో కీలక పాత్ర మోజాబా పోషించాడు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), మోజాబా ఖమేనీకు మధ్య చాలా రోజుల నుంచి క్లోజ్ రిలేషన్ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే మోజాబా ఖమేనీ ఎన్నికకు లైన్ క్లియర్ అయింది. కాగా మోజాబా ఖమేనీ ఎన్నికపై ఇజ్రాయెల్ - అమెరికా స్పందించాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా అయతుల్లా అలీ ఖమేనీ రెండు రోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే. ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న అయతుల్లా అలీ ఖమేనీ కార్యాలయంపై దాదాపు 30 బాంబులు ఇజ్రాయెల్ వేసింది. ఈ తరుణంలోనే ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కొంతమంది మరణించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande