టీ20 వరల్డ్ కప్ ఫైనల్: కివీస్ను దెబ్బకొట్టేందుకు భారత్ సిద్ధం..
మహమ్మదాబాద్, 07 మార్చి (హి.స.) టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం న్యూజిలాండ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలో టీమ్ ఇండియా
క్రికెట్


మహమ్మదాబాద్, 07 మార్చి (హి.స.)

టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్

ఆదివారం సాయంత్రం న్యూజిలాండ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం (Narendra Modi Stadium)లో జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే రెండు జట్లు సిద్ధం అయ్యాయి. ఈ క్రమంలో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ తుది జట్టులో కీలక మార్పులపై కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జాతీయ వార్తల ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నప్పటికీ, సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై భారీగా పరుగులు సమర్పించుకున్న వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) స్థానంపై సందిగ్ధత నెలకొంది. సూపర్ 8 మ్యాచ్ల నుండి అతను తన పాత రిథమ్ను కోల్పోయినట్లు కనిపిస్తుండటంతో, అతని స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)ను తీసుకోవాలనే చర్చ బలంగా వినిపిస్తోంది. అలాగే అహ్మదాబాద్ పిచ్ బ్లాక్, రెడ్ సాయిల్ మిశ్రమంగా ఉండి ఫాస్ట్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉండటంతో, అదనపు పేసర్ కావాలనుకుంటే మహమ్మద్ సిరాజ్ను బరిలోకి దించేందుకు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Captain Surya Kumar Yadav) చుపుతున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు న్యూజిలాండ్ (New Zealand) జట్టులో నలుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండటం భారత్కు కొత్త సవాలుగా మారింది. వారిని కట్టడి చేసేందుకు ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన అక్షర్ పటేల్ (Axar Patel)ను తప్పించడం కష్టంగా మారిన నేపథ్యంలో, సుందర్ ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఆల్రౌండర్ శివమ్ దూబే ఈ టోర్నీలో బౌలింగ్లో ధారాళంగా పరుగులు ఇస్తుండటం టీమ్ ఇండియాకు తలనొప్పిగా మారింది. ఈ బలహీనతలను అధిగమించి, అహ్మదాబాద్ వేదికగా కివీస్ను దెబ్బకొట్టేందుకు భారత్ తన తుది అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande