
డిల్లీ, 01 ఏప్రిల్ (హి.స.)
జాతీయ భద్రతాపరమైన ఆందోళనల దృష్ట్యా, ఏప్రిల్ 1 నుంచి చైనాలో తయారైన సీసీటీవీ కెమెరాలపై భారతదేశం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ చర్య ప్రధానంగా హిక్విజన్, దహువా టెక్నాలజీ, టీపీ-లింక్ వంటి కంపెనీలను లక్ష్యంగా చేసుకుంది.ఈ నిర్ణయం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నిఘా పరికరాల మార్కెట్ను పునర్రూపకల్పన చేస్తుందని, స్థానిక తయారీదారులకు బలమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.
కోత్త ప్రభుత్వ ధృవీకరణ నిబంధనల ప్రకారం, కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటించనంత వరకు చైనా బ్రాండ్లు భారతదేశంలో ఇంటర్నెట్-కనెక్టెడ్ సీసీటీవీ కెమెరాలు, సంబంధిత నిఘా పరికరాలను విక్రయించడానికి అనుమతించరు.భారత మార్కెట్లో నిఘా పరికరాలను విక్రయించే ముందు తయారీదారులు అధికారిక అనుమతి పొందడాన్ని ఈ నిబంధనలు తప్పనిసరి చేస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi