
విజయనగరం జిల్లా, 13 ఏప్రిల్ (హి.స.)విజయనగరం జిల్లాలోని రామతీర్ధం కొండపై ఉన్న పురాతన శ్రీరాముని విగ్రహం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ధ్వంసమవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
ఈ ఘటనపై అప్పట్లో దర్యాప్తు కూడా జరిగింది. శ్రీరాముని విగ్రహానికి సంబంధించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుర్తు తెలియని దుండగుల చేతిలో ధ్వంసమైన పురాతన శ్రీరాముని విగ్రహానికి సంబంధించి శాస్త్రోక్తంగా ‘స్వస్తి’ కార్యక్రమం నిర్వహించారు. రామతీర్ధంలోని కోటిపల్లి తీరంలో శ్రీరాముని విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఒక భావోద్వేగ ఘట్టంగా మారింది. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ శాస్త్రోక్తంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ