చివరకు క్షమాపణ చెప్పిన కమెడియన్ అనుదీప్
పవన్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు.
Pawan Kalyan Ustaad Bhagat Singh Movie Booking Open In


హైదరాబాద్, 13 ఏప్రిల్ (హి.స.)

వినోదం పేరుతో హద్దులు దాటితే తీవ్ర పరిణామాలు తప్పవని మరోసారి రుజువైంది. స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికాల తన కామెడీ షోలో ప్రముఖ రాజకీయ, సినీ రంగ వ్యక్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆయన చివరకు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

ఇటీవల హైదరాబాద్లోని ఓ కామెడీ క్లబ్లో అనుదీప్ చేసిన ప్రదర్శనకు సంబంధించిన వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రదర్శనలో భాగంగా ఆయన మెగా డాటర్ నిహారిక కొణిదెల వ్యక్తిగత జీవితంపై, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ను కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీంతో మెగా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్లను ఉద్దేశించి కూడా అనుచితంగా మాట్లాడటంతో టీడీపీ, నందమూరి అభిమానులు సైతం మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై ఆగ్రహంతో పెద్ద సంఖ్యలో అభిమానులు అనుదీప్ ప్రదర్శన ఇచ్చే 'ది స్ట్రీట్ కామెడీ క్లబ్' వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. ఆ సమయంలో క్లబ్లోపలికి వెళ్లి అనుదీప్ కోసం వెతకగా, ఆయన అక్కడ లేకపోవడంతో నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేసి వెళ్లిపోయారు. అభిమానుల ఆగ్రహం, నిరసనలతో భయపడిన అనుదీప్, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande