
తిరుమల, 18 ఏప్రిల్ (హి.స.)సాధారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శనివారం శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వారం భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. ఉదయం 8 గంటల సమయం వరకూ .. శ్రీవారి ఉచిత దర్శనార్ధం 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 6 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు 3-4 గంటల్లో దర్శనం జరుగుతుందని తెలిపింది. రూ.300 శీఘ్రదర్శనం టికెట్లు పొందిన భక్తులకు 2-3 గంటల సమయం పడుతుందని పేర్కొంది. కాగా.. నిన్న (శుక్రవారం) స్వామివారిని 69,049 మంది భక్తులు దర్శించుకోగా.. 23,842 మంది భక్తులు శ్రీవారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.57 కోట్లు సమకూరినట్లు టీటీడీ వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV