
మచిలీపట్నం, 18 ఏప్రిల్ (హి.స.) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఫీక్ అహ్మద్ను చిలకలపూడి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్పై విడుదల చేశారు. స్టాండప్ కమెడియన్గా పనిచేస్తున్న రఫీక్ 2023, 2024 సంవత్సరాల్లో విశాఖపట్నంలో జరిగిన రెండు షోలలో పవన్కల్యాణ్పైనా, ఆయన కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వాటిని అప్లోడ్ చేశాడు. మచిలీపట్నానికి చెంది న జనసేన కార్యకర్తలు శాయన శివయ్య, మోకా రవి.. చిలకలపూడి పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విశాఖలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ