ఎగ్జిట్ పోల్స్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం కాయం
ఢిల్లీ, 29 ఏప్రిల్ (హి.స.) : దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం ఖాయమని తేల్చాయి. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉ
Exit-poll-five-state-NDA-ahead


ఢిల్లీ, 29 ఏప్రిల్ (హి.స.)

: దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎన్డీయే ప్రభంజనం ఖాయమని తేల్చాయి. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. మే 4న ఎన్నికల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. వివిధ సంస్థలు ఓటర్ల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎగ్జిట్స్ పోల్స్ను విడుదల చేశాయి.

పశ్చిమ బెంగాల్

రెండో దశ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఎంసీ, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. అధిక సంఖ్యలో పోలింగ్ శాతం నమోదు కావడం, ముఖ్యంగా మహిళా ఓటర్ల పాల్గొనడం ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

తమిళనాడు

234 నియోజకవర్గాల్లో ఒకే దశలో జరిగిన ఎన్నికల్లో 82 శాతం పైగా ఓటింగ్ నమోదైంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో టీవీకే విజయ్, బీజేపీ కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని సూచనలు వెలువడుతున్నాయి.

కేరళం

ఎప్పటిలాగే అధిక ఓటింగ్ నమోదైన కేరళంలో ఎగ్జిట్ పోల్స్ స్పష్టమైన మెజారిటీని చూపడం కష్టం. ఎల్డిఎఫ్, యూడిఎఫ్ మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఓటర్ల అభిప్రాయం చివరి నిమిషంలో మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అసోం

85 శాతం పైగా పోలింగ్ నమోదైన అసోంలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలతో పోటీ ఉన్నప్పటికీ, ఎన్డీఏ బలంగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.

పుదుచ్చేరి

89 శాతం పైగా పోలింగ్ నమోదైన పుదుచ్చేరి రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ఆధిక్యం సాధించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అధిక ఓటింగ్ ప్రజల రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబిస్తోంది.

ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బలంగా నిలుస్తోంది. తమిళనాడులో డీఎంకే ఆధిక్యం కొనసాగుతుందని అంచనాలు ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ–బీజేపీ మధ్య పోటీ, కేరళలో ఎల్డిఎఫ్–యూడిఎఫ్ మధ్య పోటీ కనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు

 rajesh pande