సంగీత్ శోభన్ 'రాకాస' మూవీ రివ్యూ.. మెగా డాటర్ నిహారిక మరో హిట్ కొట్టినట్టేనా?
మానస శర్మ దర్శకత్వంలో వస్తున్న రాకాస మూవీ నేడు థియోటర్లోకి వచ్చింది
Rakasa


హైదరాబాద్, 03 ఏప్రిల్ (హి.స.)

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో, యంగ్ సెన్సేషన్ సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'రాకాస'. మానస శర్మ దర్శకత్వంలో హారర్, కామెడీ, ఫాంటసీ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం నేడు థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తోంది. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతూ, ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగడం ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్. ఈ సినిమాకు సంగీత్ శోభన్ మ్యాన్ ఆఫ్ ది షో అని చెప్పొచ్చు. తనదైన మార్క్ కామెడీ టైమింగ్తో థియేటర్లలో నవ్వులు పూయించాడు. ముఖ్యంగా సెకండాఫ్లో వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆడియెన్స్కి ఫుల్ ఫన్ మీల్స్ అని చెప్పాలి. హీరోయిన్ నయన్ సారిక తన రోల్లో చాలా డీసెంట్గా నటించి మెప్పించింది.

ఇక బ్రహ్మ రాక్షసుడి పాత్రలో నటించిన నటుడు ఆ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి భయపడేలా చేశారు. మొత్తం మీద, ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకుంటూ, థ్రిల్ అవ్వడానికి 'రాకాస' ఒక పర్ఫెక్ట్ ఛాయిస్. మొత్తానికి ఈ సినిమా 3.5 రేటింగ్తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. నిహారిక రెండో చిత్రం కూడా హిట్ అయ్యేలా కనిపిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande