INS తారాగిరి జాతికి అంకితం : విశాఖ కేంద్రంగా వార్ షిప్ సేవలు
యుద్ధనౌక INS తారాగిరిని జాతికి అంకితమిచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్
union-minister-rajnath-singh-dedicates-ins-taragiri-to-the-nation-537


విశాఖపట్టం, 03 ఏప్రిల్ (హి.స.) ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన యుద్ధనౌక INS తారాగిరిని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. స్టెల్త్ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫ్రిగేట్ ను సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి ఇతర అధికారులతో కలిసి జలప్రవేశం చేయించారు. ఈ వార్ షిప్ శత్రువుల రాడార్లకు కనిపించకుండా విశాఖ కేంద్రంగా పనిచేయనుంది.

ఐఎన్ఎస్ తారాగిరి బాడీని ప్రత్యేకమైన ఆకృతిలో నిర్మించడం వల్ల శత్రువుల రాడార్లకు అంత సులభంగా చిక్కదు. సముద్రం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించేందుకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులు ఇందులో ఉన్నాయి. గగనతలం నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనేందుకు బరాక్ -8 క్షిపణులను వాడుతారు. సముద్రం లోపల దాగి ఉన్న శత్రు జలాంతర్గాముల్ని వేటాడేందుకు టార్పెడోలు, రాకెట్ లాంచర్లను కూడా అమర్చారు. ముంబైకి చెందిన మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ (MDL)దీనిని నిర్మించింది. 75 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో ఈ జలాంతర్గామిని తయారు చేయడం ఆత్మనిర్భర్ భారత్ లో గొప్ప మైలురాయి అని చెప్పాలి. ఇదొక మల్టీ రోల్ యుద్ధ నౌక కూడా. ఒకేసారి గాలిలో, నీటిపైన, నీటి లోపల కూడా పోరాడగలిగే సామర్థ్యం దీని సొంతం.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande