బీఆర్ఎస్లోకి జీవన్ రెడ్డి... త్వరలో కేటీఆర్ సమక్షంలో..!
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నారు
Jeevanreddy


హైదరాబాద్, 03 ఏప్రిల్ (హి.స.)మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు వెళ్లి జీవన్ రెడ్డిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13న జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 6న అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే కేటీఆర్.. జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం.

జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు జీవన్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని కేటీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన ఆయన.. నిత్యం జనంలోనే ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande