పార్లమెంట్లో మా గొంతు నొక్కారు: ఉపరాష్ట్రపతికి వైసీపీ ఎంపీల కంప్లైంట్
ఉభయసభల్లో బిల్లుపై చర్చించేదుకు తగిన సమయం ఇవ్వలేదని వైసీపీ ఎంపీలు కంప్లైంట్ ఇచ్చారు
/ysrcp-mps-complained-to-the-vice-president-on-the-amaravati-b


డిల్లీ, 03 ఏప్రిల్ (హి.స.)

అమరావతి చట్టబద్ధత బిల్లు(Amaravati Ligalization Bill)కు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఉభయసభల్లోనూ ఈ బిల్లుపై చర్చించేందుకు తగిన సమయంలో ఇవ్వలేదని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఫిర్యాదు చేశారు. అమరావతి బిల్లుపై తమకు తగినంత సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ఏడుగురు ఎంపీలుంటే 5 నిమిషాలే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఎంపీలుంటే 20 నిమిషాలు సమయం కేటాయించారని తెలిపారు.

అమరావతికి తాము వ్యతిరేకం కాకపోయినా దుష్ప్రచారం చేస్తు్న్నారని చెప్పారు. ఇక బిల్లులో రైతులకు చేసే న్యాయంపై క్లారిటీ ఇవ్వలేదని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande