
హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)ఐపీఎల్(IPL 2026) 19వ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాటింగ్తో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. తన అరంగేట్ర మ్యాచ్లోనే మెరుపు హాఫ్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన వైభవ్.. నిన్న గుజరాత్ టైటాన్స్తో జరిగిన రెండో మ్యాచ్లో కేవలం 18 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్ ద్వారా భారత దిగ్గజ ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న 18 ఏళ్ల నాటి రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. గతంలో 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్-గౌతమ్ గంభీర్ జోడీ 309 బంతుల్లో 500 పరుగులు పూర్తి చేసింది.
తాజాగా వైభవ్, జైస్వాల్ జోడీ కేవలం 248 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకుంది. వీరిద్దరూ కలిసి పవర్ ప్లేను పూర్తిస్థాయిలో వాడుకుని 6.2 ఓవర్లలోనే 70 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఓ టీనేజర్, ఓ యువ ఆటగాడు కలిసి సృష్టించిన ఈ రికార్డును భవిష్యత్తులో దిగ్గజ ఆటగాళ్లు కూడా అధిగమించడం కష్టమేనని క్రీడా నిపుణులు అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్