ముంబై ఇండియన్స్ కు భారీ ఊరట: కోలుకున్న హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా కోలుకోవడంతో ముంబై ఇండియన్స్ కు భారీ ఊరట లభించింది
Cricket


హైదరాబాద్, 05 ఏప్రిల్ (హి.స.)

ఐపీఎల్ 2026 సీజన్లో వరుస ఒడుదొడుకులను ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ జట్టుకు శుభవార్త అందింది. అనారోగ్యం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తో జరిగిన గత మ్యాచ్కు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. మంగళవారం రాజస్థాన్ రాయల్స్ తో జరగనున్న కీలక పోరులో ఆయన బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్ లో ముంబై ప్రదర్శన మిశ్రమంగా ఉంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ (KKR) పై అద్భుత విజయాన్ని అందుకున్న జోరును ముంబై కొనసాగించలేకపోయింది.

నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ గైర్హాజరీ జట్టుపై స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్ లో ముంబై ఓటమిని చవిచూసింది. ఇప్పుడు జట్టు పగ్గాలను హార్దిక్ తిరిగి చేపట్టనుండటంతో, రాజస్థాన్ పై విజయం సాధించి మళ్లీ ఫామ్ లోకి రావాలని ముంబై భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande