టెహ్రాన్పై అమెరికా దాడి.. వీడియో విడుదల చేసిన ట్రంప్
టెహ్రాన్పై అమెరికా దాడి చేసింది దానికి సంబంధించిన వీడియోను ట్రంప్ విడుదల చేశారు
ట్రంప్


ఢిల్లీ, 05 ఏప్రిల్ (హి.స.) పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. యుద్ధం మొదలై ఆరవ వారానికి చేరిన నేపథ్యంలో అమెరికా దాడులు మరింత ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని కీలక సైనిక స్థావరంపై అమెరికా-ఇజ్రాయెల్ కూటమి దళాలు జరిపిన భారీ వైమానిక దాడికి సంబంధించిన వీడియోను ట్రంప్ విడుదల చేసారు. ఈ వీడియోతో పాటు ట్రంప్ రాసిన సందేశం మరింత ఉత్కంఠను రేపుతోంది: అనాలోచితంగా, సరిగ్గా నడిపించలేని ఇరాన్ సైనిక నాయకులు చాలా మంది ఈ భారీ దాడిలో అంతమొందించబడ్డారు. ఇంకా ముందుంది! అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ వెంటనే చర్చలకు వచ్చి ఒప్పందం కుదుర్చుకోవాలని, లేనిపక్షంలో మరిన్ని భయంకరమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ 48 గంటల గడువు విధించారు. కాగా ఈ దాడులను ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande