
కర్నూలు, 06 ఏప్రిల్ (హి.స.)ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేటి రోజుల్లో చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే లీటర్ల కొద్దీ నీరు తాగడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నారు. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచిదే అయినప్పటికీ, అది సరైన పద్ధతిలో, సరైన మోతాదులో లేకపోతే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ.
ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం మంచిదే అయినప్పటికీ, అది సరైన పద్ధతిలో, సరైన మోతాదులో లేకపోతే ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువని ఆరోగ్య నిపుణులు డా.అబ్బేగిరె మంజళు ఎన్. హెచ్చరిస్తున్నారు.
జీర్ణక్రియ మందగించే ప్రమాదం: సాధారణంగా ఉదయం పూట మన శరీరంలో జీర్ణశక్తి కొంత తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో దానికి శక్తినివ్వడానికి బదులుగా ఒకేసారి అధిక మొత్తంలో నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మరింత మందగిస్తుంది. దీనివల్ల మనం తీసుకునే అల్పాహారం సరిగ్గా అరగక, కడుపులోనే ఉండి అజీర్తి సమస్యలకు దారితీస్తుంది. అజీర్ణం కారణంగా శరీరంలో విషపదార్థాలు పేరుకుపోయే అవకాశం ఉంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. ఇది కాలక్రమేణా తీవ్రమైన మలబద్ధకానికి దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయాన్నే అతిగా నీరు తాగడం వల్ల పొట్టపై ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల కడుపు ఉబ్బరంగా అనిపించడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొందరిలో ఇది కడుపు నొప్పికి లేదా వాంతులు అయ్యే భావనకు కూడా కారణమవుతుంది ఉదయాన్నే ఒకేసారి 2 లీటర్ల నీటిని తాగే ప్రయత్నం మానుకుని, రోజంతా కొద్దికొద్దిగా నీటి వినియోగాన్ని పెంచుకోవడం ఉత్తమం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV