బ్లాక్ బాక్స్ డాటాను బహిర్గతం చేయాలి
కాక్పిట్ వాయిస్ రికార్డు, బ్లాక్ బాక్స్ డేటాను బయటపెట్టాలని కేంద్రాన్ని కోరిన బాధిత కుటుంబాలు
బ్లాక్ బాక్స్ డాటాను బహిర్గతం చేయాలి


అహ్మదాబాద్, 06 ఏప్రిల్ (హి.స.) అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన జరిగిన 10 నెలలు దాటుతున్నది. ఈ ఘటనలో అత్యంత కీలకమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), బ్లాక్బాక్స్ డాటాను బహిర్గతం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. నష్టపరిహారంగా తమకు ఇస్తామంటున్న డబ్బును నిరాకరిస్తున్నాయి. బ్లాక్ బాక్స్ డాటాను కేంద్రం విడుదల చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి వారంతా లేఖ రాశారు. 260 మంది మరణాలకు కారణమైన ఈ విమాన దుర్ఘటనలో ఎన్నో కుటుంబాలు తమ ఆప్తులను కోల్పోయాయి. బాధిత కుటుంబాలకు చెందిన 30 మంది అహ్మదాబాద్లో సమావేశమయ్యారు.

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande