
చెన్నై, 06 ఏప్రిల్ (హి.స.) దేశంలో ఎన్నికల వేడి పీక్ స్టేజ్కు చేరుకుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో (ఏప్రిల్ 6) ముగిసింది. తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల మధ్య ప్రధాన పోటీ ఉండగా, బెంగాల్లో టీఎంసీ, బీజేపీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది.
నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలపై ప్రధాని మోదీ స్పందించారు. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలకు లోక్సభ స్థానాల విషయంలో ఎటువంటి అన్యాయం జరగదని, వారి అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఈ అంశంపై రాజకీయంగా వస్తున్న విమర్శలను ఆయన కొట్టిపారేశారు.
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రచార పర్వం ఊపందుకోనుంది. రేపటి నుంచి అభ్యర్థుల తుది జాబితాపై పూర్తి స్పష్టత రానుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi