అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్: ఎంపీ లక్ష్మణ్
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్ చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు.
Lakshman


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్ చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్నా.. రేవంత్ వైపు గాలి వీచిందని తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ విలేకర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ఎవరూ ఊహించలేదన్నారు. తెలంగాణ ప్రజలు తెలివైన వారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినా.. 38 శాతం ఓట్లు ప్రజలు ఇచ్చారని ఎంపీ లక్ష్మణ్ వివరించారు.

వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అవుతుందని ఈ సందర్భంగా ఆయన జోస్యం చెప్పారు. ఒక ఎన్నిక తీసుకుని ఎప్పుడూ అంచనా వేయడం తప్పు అని అభిప్రాయపడ్డారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు తరువాత.. మొత్తం వన్ సైడేనని అన్నారు. ఇప్పటికే మహిళా బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనే విషయం ప్రజల్లోకి వెళ్లిందని తెలిపారు.

బట్ట కాల్చి మీద వేస్తే.. ప్రజలు అంత అమాయకులు కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చునని చెప్పారు. తమిళనాడులో టీవీకే పార్టీ అధినేత విజయ్ సమావేశాలకు ప్రజలు భారీగా వస్తున్నారని.. కానీ ఆ పార్టీ జస్ట్ 5 లేదా 6 సీట్ల కంటే ఎక్కువ గెలవదన్నారు.

తెలంగాణలో హెట్ స్పీచ్ బిల్లు తెచ్చి పకడ్బందీగా అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించారని ఎంపీ లక్ష్మణ్ గుర్తు చేశారు. ముస్లింలను రెచ్చగొట్టే వ్యాఖ్యలపై సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది హెట్ స్పీచ్ కాదా? అని సీఎంను ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఏం ఆలోచిస్తారో రెండో వ్యక్తికి కూడా తెలియదన్నారు.

ఎక్కువ గెలవదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande