సాదాసీదా ప్రయాణికుడి వలె మెట్రోలో ప్రయాణించిన మంత్రి జూపల్లి
మంత్రి జూపల్లి కృష్ణారావు మెట్రోలో ప్రయాణించారు
మంత్రి జూపల్లిమంత్రి జూపల్లి


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)

మంత్రి జూపల్లి కృష్ణారావు

మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులతో సరదాగా మాట్లాడారు. బుధవారం నగరంలోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఆయన ఎర్రమంజిల్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు మెట్రోలో వెళ్లారు. ప్రోటోకాల్స్ కు భిన్నంగా ఆయన అత్యంత సాదాసీదాగా మెట్రో ఎక్కారు. మెట్రో స్టేషన్ కు చేరుకున్న మంత్రి స్వయంగా టికెట్ తీసుకుని ప్లాట్ఫాంపైకి వెళ్లారు. రైలులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, మంత్రి సీటు కోసం ప్రయత్నించకుండా తోటి ప్రయాణికులతో కలిసి నిలబడే ప్రయాణించారు. ఈ క్రమంలో తోటి ప్రయాణికులతో ఆయన ముచ్చటించారు. మెట్రో ప్రయాణంలో సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande