ఐఏఎస్లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్పై ఎంపీ చామల ధ్వజం
కేసీఆర్ హయాంలోని పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.
Congress


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)కేసీఆర్ హయాంలోని పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎప్పటికీ బీఆర్ఎస్ ఒడిపోదని తమ మామ ముఖ్యమంత్రిగా ఉంటారని మాజీ మంత్రి హరీశ్రావు కలలు కన్నారని ఎద్దేవా చేశారు. రోజుకో ఎపిసోడ్తో తెలంగాణ ప్రజలను తప్పు దోవ పట్టించి బదనాం చేయాలని చూస్తున్నారని ఆగ్రహించారు. ఈరోజు(బుధవారం) గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు ఫ్రూట్ మార్కెట్ కోసం కోహెడలో 178 ఎకరాలు కాంగ్రెస్ ఇచ్చిందని ప్రస్తావించారు. కేసీఆర్ హయాంలోని పదేళ్లలో ఫ్రూట్ మార్కెట్ను ఎందుకు డెవలప్ చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్లను బెదిరించి రాత్రికి రాత్రి చీకటి జీవోలు తెచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారాయన.

హరీశ్రావు కూడా ముఖ్యమంత్రి కావొచ్చని ఇది ప్రజల తీర్పుతోనేనని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2014, 2018లో మీరు ఇచ్చిన మేనిఫెస్టోను తన సోషల్ మీడియాలో రిలీజ్ చేద్దామని.. ఎంత మంది లైక్లు కొడతారో చూద్దామని అన్నారు. 70 శాతం హామీలను అమలు చేయని బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ను బదనాం చేయాలని చూస్తోందని ఆగ్రహించారు. 2014లో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారంలోకి వచ్చిన పార్టీ మీది కాదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ దరిద్ర పాలనపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. దళితులని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారని ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కేజీ టూ పీజీ ఎక్కడ పోయింది? అని నిలదీశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. రెండో సారి ఇచ్చిన హామీలు కూడా తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. రుణమాఫీ చేస్తానని చెప్పారని ఎందుకు చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande