
మధ్యప్రదేశ్, 08 ఏప్రిల్ (హి.స.)
ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఒక ముస్లిం పురుషుడు ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భారతీయ శిక్షా స్మృతి(IPS) లోని సెక్షన్ 494 ప్రకారం రెండో వివాహం(Bigamy) నేరం కిందకు రాదని పేర్కొంటూ ఓ భర్తపై నమోదైన కేసును కొట్టివేసింది. పెళ్లైన 20 తర్వాత తనకు పిల్లలు కలగలేదనే కారణంతో భర్త తనను వేధించాడని, తనను కొట్టడంతో పాటు రెండో పెళ్లి చేసుకుని తనను ఖులా (విడాకులు) ఇవ్వాలని ఒత్తిడి చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ తన భర్తపై కేసులు పెట్టింది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ సదరు భర్త మధ్య ప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బి.పి. శర్మ నేతృత్వంలోని బెంచ్.. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఒక పురుషుడు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు (నలుగురు భార్యల వరకు) చేసుకోవడానికి అనుమతి ఉందని పేర్కొంది. అందువల్ల సెక్షన్ 494 కింత ఉన్న ప్రాథమిక నిబంధనలు ఇతడికి వర్తించవని కోర్టు పేర్కొంది. అలాగే భార్యపై వేధింపులు (498-A), కొట్టడం (323), బెదిరింపులు(506) వంటి ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నందున ఆ సెక్షన్ల కింద ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు