విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.. మెదక్ జిల్లా కలెక్టర్
నాణ్యమైన విద్యని అందించాలని కలెక్టర్ చెప్పారు
collector


మెదక్, 08 ఏప్రిల్ (హి.స.) మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

బుధవారం రామాయంపేట మున్సిపల్ లో విస్తృతంగా పర్యటించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, రేషన్ షాప్ ను పరిశీలించారు. కస్తూర్బా గాంధీ విద్యాలయంలో మౌలిక వసతులను పరిశీలించిన ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. పదవ తరగతి విద్యార్థులకు స్వయంగా కలెక్టర్ పాఠాలు బోధించారు. పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు చేయాలని, నాణ్యమైన గుణాత్మకమైన విద్య అందించాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం దామరచెరువు గ్రామంలోని రేషన్ షాపును పరిశీలించి మూడు నెలల రేషన్ లబ్దిదారులకు సక్రమంగా అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి సంబంధిత అధికారులు ఉన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande