
నాగర్ కర్నూల్, 08 ఏప్రిల్ (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా
రంగం అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం వారు వనపర్తి జిల్లా కేంద్రంలో నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి లతో కలిసి రూ. 1.20 కోట్ల ఎంపీ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని ప్రారంభించి, రూ. 80 లక్షలతో మర్రికుంట, కేజీవిబీ పాఠశాల లో మౌళిక వసతుల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి ఎస్సీ సంక్షేమ హాస్టల్ విద్యార్థినులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగం అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి
స్వయంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకున్నారని, అందుకే అయన సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు ప్రాధాన్యత ఇస్తూ నూతన భవన నిర్మాణానికి సహకరించరన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు