భాషల వైవిధ్యమే భారత ఐక్యతకు పునాది: గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
విభిన్న భాషల సంస్కృతి, సాంప్రదాయాల సమ్మేళనమే అఖండ భారతదేశ నిర్మాణం
Governor


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)

విభిన్న భాషల సంస్కృతి, సాంప్రదాయాల సమ్మేళనమే అఖండ భారతదేశ నిర్మాణం అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా అన్నారు. బోయినపల్లి కేంద్రీయ హిందీ సంస్థాన్ విద్యాలయంలో హిందీ భాషా వ్యవస్థాపకులు పద్మభూషణ్ అవార్డు గ్రహీత మోటూరి సత్యనారాయణ కాంస్య విగ్రహాన్ని బుధవారం గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతు దేశంలో మనం ఏ రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర భాషను అధికారికంగా నేర్చుకుంటు ఆ ప్రాంత ప్రజలకు అర్థమయ్యే రీతిలో పనిచేయడమే భారత పౌరుల ప్రధాన బాధ్యత అన్నారు. అందులో భాగంగానే తాను హిమాచల్ ప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సమయంలో గవర్నర్ తెలుగు నేర్చుకుని తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేసినట్లు తెలిపారు. ఇక్కడి తెలుగు భాషను నేర్చుకొని ఉగాది పండుగ వేడుకల్లోను తెలుగు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుగులోనే శుభాకాంక్షలు తెలిపి తన సుదీర్ఘ ప్రసంగాన్ని వినిపించినట్లు ఆయన పేర్కొన్నారు.

హిందీ భాషలో ఎదుటివారికి ప్రేమ పూర్వకంగా ఎలాంటి సందర్భాలలోనైనా హిందీలో చెప్పినట్లయితే ప్రేమ పూర్వకంగానే ఉంటుందని, అదే ఇంగ్లీష్ లో ఏదైనా చెప్పినట్లయితే భయపెట్టినట్లుగా ఉంటుందని ఉదాహరణకు డోంట్ టచ్ అనే ఆంగ్ల పదాలు చిన్న పిల్లల పట్ల బెదిరింపుగా ఉంటుందని ఆయన అన్నారు. భారతదేశ ప్రజలు అందరికి హిందీ భాషా ఎంతో అవసరం అనే దృడ సంకల్పంతో మోటూరు సత్యనారాయణ ఆగ్రా నగరంలో 1960లో హిందీ సంస్థాన్ విద్యాలయాన్ని స్థాపించారని పేర్కొన్నారు.ఆంధ్ర ప్రదేశ్ కృష్ణ జిల్లాలో జన్మించిన ఆయన హిందీ భాషపై మక్కువతో మచిలీపట్నంలోని ఒక గురువు దగ్గర హిందీ నేర్చుకున్నారని,అయితే ఉత్తర భారతదేశంలో పూర్తి స్థాయిలో అక్కడి హిందీ నేర్చుకుని దక్షిణ భారతదేశంలోని ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలకు సైతం హిందీ భాష నేర్పించడానికి దేశవ్యాప్తంగా 8 హిందీ సంస్థాన్ కేంద్రాలను ఆయన స్థాపించారనీ గవర్నర్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande