ఘనంగా హిందూ సమ్మేళనం
ఆదిలాబాద్ లో ఘనంగా హిందూ సమ్మేళనం జరిగింది
ఘనంగా హిందూ సమ్మేళనం


అదిలాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)

సనాతన హిందూ ధర్మం, భగవగ్బక్తి, సమసమాజ స్థాపన కోసం ప్రజలను చైతన్యం చేసేందుకు యువత నడుం బిగించాలని శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర ఆలయ ప్రాంగణంలో జరిగిన హిందూ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ముందుగా గోపూజ, సామూహిక కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పారాయణం ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆలోచింపచేశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande