సీఎం రేవంత్ రెడ్డితో టాటా లాక్డ్ మార్టిన్ ఎండీ భేటీ.. తెలంగాణకు మెగా ప్రాజెక్ట్!
తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరో కీలక ముందడుగు వేసింది
Cm


హైదరాబాద్, 08 ఏప్రిల్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగం మరో కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ దిగ్గజం టాటా లాకోడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ లిమిటెడ్ (TLMAL) మేనేజింగ్ డైరెక్టర్ టిమ్ రైఫిల్ (Tim Riffle) బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ సంస్థ కార్యకలాపాల విస్తరణ మరియు నూతన పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. లాకోడ్ మార్టిన్ సంస్థ భారతదేశంలో C130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయబోతోంది. అంతర్జాతీయ అవసరాల కోసం భారతదేశంలోని TASLలో F-16 వింగ్స్ ను ఉత్పత్తి చేసేందుకు TASLతో లాక్డ్ మార్టిన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో తెలంగాణలోనూ పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్లు టిమ్ రైఫిల్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande