భారతీ సిమెంట్ క్వారీ పనులకు అడ్డగింత
భారతి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం కొనుగోలు చేసిన భూముల్లో మైనింగ్ పనులకు అడ్డంకి
భారతీ సిమెంట్ క్వారీ పనులకు అడ్డగింత


ఎర్రగుంట్ల,, 09 ఏప్రిల్ (హి.స.)

ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు పంచాయతీ టి.సుంకేసులలోని భారతి సిమెంట్ క్వారీ పనులను గ్రామస్థులు బుధవారం అడ్డుకున్నారు. గ్రామ సమీపంలో గతంలో భారతి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం కొనుగోలు చేసిన భూముల్లో మైనింగ్ పనులు ప్రారంభించడంతో తమ నివాసాలకు ఇబ్బందులు ఏర్పడుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. నివాసాల సమీపంలో మైనింగ్ పనులు చేపడితే పేలుళ్లతో ఇళ్లు దెబ్బతినే అవకాశం ఉందని వాపోయారు. పనులు ప్రారంభించాలంటే గ్రామాన్ని మొత్తం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. భారతి సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం సుమారు 750 ఎకరాలు కొనుగోలు చేసినా స్థానికులకు ఉపాధి కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిశ్రమ ప్రతినిధులను, గ్రామస్థులకు నచ్చజెప్పి అక్కడ నుంచి పంపేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande