
చిలకలూరిపేట,, 09 ఏప్రిల్ (హి.స.) : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కారు బీభత్సం సృష్టించింది. విజయ బ్యాంకు సెంటర్లో ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో హోటల్లోని సామగ్రి, ఫర్నీచర్ ధ్వంసం అయ్యాయి. గంజాయి మత్తులో కారును వేగంగా నడిపినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు ఉన్నారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ