ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం దాడికి యత్నించిన మాజీ మంత్రి కాకాని
నెల్లూరు, 09 ప్రిల్ (హి.స.)ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బందిని కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేశారు. ‘దమ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం దాడికి యత్నించిన మాజీ మంత్రి కాకాని


నెల్లూరు, 09 ప్రిల్ (హి.స.)ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సిబ్బందిని కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేశారు. ‘దమ్ముంటే, మగాళ్లు అయితే బారికేడ్లు దాటి రండి’ అంటూ సిబ్బందిని హెచ్చరించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణని తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు కాకాణి.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు, ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేసేందుకు కాకాణి, వైసీపీ శ్రేణులు తీవ్రంగా యత్నించారు. బారికేడ్లు, పోలీసులను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో పాటు ఆంధ్రజ్యోతి ప్రతులని దహనం చేసి విధ్వంసం సృష్టించారు. ఈ సంఘటనపై ఆంధ్రజ్యోతి బ్రాంచ్ మేనేజర్ కె.హరికృష్ణ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు పోలీసులు సెక్షన్లు 189(2), 126(2), 79, 351(2) ఆర్/డబ్ల్యూ 190 బీఎన్ఎస్ కింద కాకాణి, మరికొందరిపై కేసు నమోదు చేశారు. మీడియా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడి యత్నాన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande