స్రీ శక్తి పథకం.మరో మైలు రాయి కి.చేరింది
స్త్రీశక్తి పథకం మరో మైలురాయికి చేరింది
స్రీ శక్తి పథకం.మరో మైలు రాయి కి.చేరింది


నరసరావు పేట, 09 ఏప్రిల్ (హి.స.)

అతివలకు ప్రయోజనం చేకూర్చేలా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం మరో మైలురాయికి చేరింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు ఆడపడచులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాల ద్వారా జిల్లాలో రూ.102 కోట్ల రాయితీని పొందారు. ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో ఆలయాల సందర్శన, శుభకార్యాలు, ఆరోగ్యం నిమిత్తం పెద్దాసుపత్రులకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. స్త్రీశక్తిని జిల్లాలో ఎక్కువ మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని డీపీటీవో అజితకుమారి తెలిపారు.

జిల్లాలోని మహిళలు స్త్రీశక్తి పథకం ద్వారా రూ.102,19,88,199 రాయితీ పొందారు. వినుకొండ డిపో పరిధిలో అత్యధికంగా రూ.22.91 కోట్లు, మాచర్ల డిపో పరిధిలో రూ.19.97 కోట్ల రాయితీ అందుకున్నారు. అత్యల్పంగా సత్తెనపల్లి డిపో పరిధిలో రూ.12.49 కోట్ల లబ్ధి పొందారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande