
అమరావతి, 09 ఏప్రిల్ (హి.స.)
: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసిద్ధ లడ్డూ ప్రసాదానికి ఆదరణ ఎప్పుడూ తగ్గదు.. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో విశ్వాసం.. తిరుమల వెళ్తున్నారంటే.. నాకు లడ్డూ తీసుకురా అని చెప్పే భక్తులు ఎంతో మంది.. అయితే, 2025–26 వార్షిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం రికార్డు స్థాయిలో లడ్డూ ప్రసాదం విక్రయాలు జరిపి కొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు విక్రయించింది టీటీడీ.. ఇక, లడ్డూల విక్రయం ద్వారా సుమారు రూ.567 కోట్లు ఆర్జించింది టీటీడీ.. రోజువారీగా సగటున 4 లక్షల లడ్డూలను తయారు చేసి, అదే స్థాయిలో విక్రయాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇది తిరుమలలో భక్తుల రద్దీ ఎంతగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ