దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు 6 అరెస్ట్,
విజయవాడ టెర్రర్ లింక్ కేసులో నలుగురుని అరెస్టు చేశారు
దేశ వ్యాప్తంగా సంచలం సృష్టించిన  విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు 6  అరెస్ట్,


అమరావతి, 09 ఏప్రిల్ (హి.స.)

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ టెర్రర్ లింక్స్ కేసులో మరో ఆరుగురిని కొత్తపేట పోలీసులు నేటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని విజయవాడ తీసుకురానున్నారు. పోలీసులు కొద్దిరోజుల క్రితం విజయవాడకు చెందిన రెహ్మతుల్లా షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్.. హైదరాబాద్కు చెందిన సయిదా బేగం.. బళ్లారికి చెందిన అబ్దుల్ సలాంలను కస్టడీకి తీసుకుని విచారించారు.

వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరో 6 మందిని విచారణ చేయనున్నారు. సీజేఎమ్ కోర్టు నేటి నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆరుమందిని కస్టడీకి అనుమతి ఇచ్చింది. టెర్రర్ లింక్స్ కేసులో మొత్తం 13 మందిపై కేసు నమోదు కాగా.. 12 మందిని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. 12 మందిలో ఒకరు మైనర్ కావడంతో జువైనల్ హోమ్కి తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande