కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్..
బంగారం రేట్లు భారీగా కుప్పకూలాయి
gold


ముంబై, 09 ఏప్రిల్ (హి.స.)గురువారం బంగారం ధరలు ఢమాల్ అంటూ పడిపోయాయి. ఒక్కసారిగా ధరలు కుప్పకూలాయి. గంటల వ్యవధిలోనే భారీ మార్పులు పసిడి ధరల్లో చోటుచేసుకున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న రాజకీయ అనిశ్చితి, యుద్ద పరిణామాలు బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. ప్రస్తుతం వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. ధరలు గంటల వ్యవధిలోనే భారీగా తగ్గుదల నమోదు చేశాయి. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన క్రమంలో స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. అలాగే బంగారం ధరలపై కూడా దీని ప్రభావం పడింది. గురువారం బంగారం రేట్లు క్రాష్ అవ్వగా.. లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

హైదరాబాద్లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,51,480 వద్ద కొనసాగుతోంది. బుధవారం ఆ ధర రూ.1,53,820 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2340 తగ్గిపోయింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,38,850గా ఉండగా.. నిన్న రూ.1,41,000 వద్ద స్ధిరపడింది. నిన్నటితో పోలిస్తే రూ.2150 పడిపోయింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande