తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. అతి తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం
తిరుమలలో సాధారణమైన భక్తుల రద్దీ
తిరుమల


తిరుమల, 09 ఏప్రిల్ (హి.స.)

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నట్లు టీటీడీ వెల్లడించింది. గురువారం ఉదయం 8 గంటల సమయానికి టోకెన్లు లేకుండా 5 కంపార్టుమెంట్లలో భక్తులు ఉచిత శ్రీవారి దర్శనం కోసమై ఎదురుచూస్తున్నట్లు టీటీడీ తెలిపింది. వారికి స్వామివారి దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి 3-5 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2-3 గంటల సమయం పడుతుందని తెలిపింది. కొత్తగా క్యూలైన్లోకి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 6-10 గంటల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలు పెరగవచ్చు, లేదా తగ్గవచ్చని చెప్పింది. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.17 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande