విజయవాడ దువ్వాడ సెక్షన్ లోని రాయనపాడు రైల్వే యార్డ్ రీ మోడలింగ్ పనులు
రాయనపాడు రైల్వే యార్డ్ రీ మోడలింగ్ పనులు స్టార్ట్ అయ్యాయి
విజయవాడ దువ్వాడ సెక్షన్ లోని రాయనపాడు రైల్వే యార్డ్ రీ మోడలింగ్ పనులు


హైదరాబాద్ , 09 ఏప్రిల్ (హి.స.)విజయవాడ-దువ్వాడ సెక్షన్లోని రాయనపాడు రైల్వేయార్డ్ రీమోడలింగ్ పనుల కారణంగా ఈ నెల 28వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు 20రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది. మరో 10 రైళ్లను దారిమళ్లించడంతో పాటు 2 రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. రద్దు అయిన వాటిల్లో సికింద్రాబాద్-విజయవాడ- (శాతవాహన),గుంటూరు-సికింద్రాబాద్ (గోల్కొండ), విజయవాడ- భద్రాచలం (మెమో), విజయవాడ-డోర్నకల్ (మోమో), విశాఖపట్నం-మహబూబ్నగర్ (విశాఖ), కాకినాడ-లింగంపల్లి(గౌతమి), సంబల్పూర్-నాందేడ్ (నాగావళి), నాందేడ్-విశాఖపట్నం- సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande