పదవ తరగతి జవాబు ముల్యంకనములో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
సెల్ఫోన్ లు చూస్తూ మూల్యాంకనం
పదవ తరగతి  జవాబు ముల్యంకనములో ఉపాధ్యాయుల నిర్లక్ష్యం


అమరావతి, 09 ఏప్రిల్ (హి.స.)

పదో తరగతి పరీక్ష జవాబు పత్రాల మూల్యాంకనంలో కొందరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎ.క్యాంపులో ఉన్న మాంటిస్సోరి పాఠశాలలో మూల్యాంకనం జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అసిస్టెంట్ ఎగ్జామినర్ల (ఏఈ) వద్ద సెల్ఫోన్లు ఉన్నాయి. కొందరు ఏఈలు సెల్ఫోన్లలో జవాబులు చూస్తూ మూల్యాంకనం చేస్తుండటం గమనార్హం. స్థల సమస్యతో పాటు బల్లలు లేకపోవడంతో ఒకే బల్లపై ఇద్దరు, ముగ్గురు ఏఈలు కూర్చుని జవాబు పత్రాల మూల్యాంకనం చేస్తున్నారు. ఈ విషయంపై పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ మాట్లాడుతూ సెల్ఫోన్లో చూస్తూ మూల్యాంకనం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై గట్టి హెచ్చరికలు చేశామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande