తెలంగాణలో పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్
తెలంగాణలో పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్
PM Narendra Modi(file)


హైదరాబాద్, 10 మే (హి.స.)

కర్ణాటక, తెలంగాణలో పర్యటనపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. తెలంగాణలో అభివృద్ధి పనులను శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. రూ.9,500 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తున్నామని తెలిపారు. రోడ్లు, లాజిస్టిక్స్, టెక్స్టైల్, రైల్వేలు వంటి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నామని అన్నారు. సింధు ఆసుపత్రిని దేశానికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటామని, సాయంత్రం సికింద్రాబాద్లో బీజేపీ సభలో పాల్గొంటామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దుష్పరిపాలనతో విసిగిన తెలంగాణ ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ ప్రజల మొదటి ఎంపిక తమ పార్టీయే అని సూచిస్తోందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande