
హైదరాబాద్, 10 మే (హి.స.)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాదులో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి విచ్చేశారు. తెలంగాణ పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన ప్రధాని మోదీ, చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు తాజా రాజకీయ అంశాలపై కాసేపు ముచ్చటించుకున్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ లోనూ మిత్రపక్ష నేత అయిన చంద్రబాబును మోదీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రధాని మోదీతో భేటీపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఈరోజు మా నివాసానికి రావడం, ఆయనకు మేం స్వాగతం పలకడం మాకు ఎంతో గౌరవంగా, ఆనందంగా ఉంది. ఇది మా కుటుంబానికి నిజంగా ఒక ప్రత్యేకమైన, చిరస్మరణీయమైన క్షణం అని చంద్రబాబు తన పోస్టులో పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi