నా మీద కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారు : మోదీ సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
నా మీద కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారు : మోదీ సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
నా మీద కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారు : మోదీ సభలో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్, 10 మే (హి.స.)

సికింద్రాబాద్ బహిరంగ సభలో కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏరోజూ పార్టీ తలవంచుకునే పనులు చేయనని, తలెత్తుకునే పనే చేస్తాను తప్ప తలదించుకునే పని చేయనని అన్నారు. కొందరు తన మీద కుట్రలు పన్ని ఏదో చేయాలని చూస్తున్నారని భావోద్వేగభరితంగా ప్రసంగించారు. రాజకీయంగా ఎదుర్కోలేక దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనపై దుష్ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. తాను ఫామ్హౌస్లో పడుకునే వ్యక్తిని కాదని, ప్రజల మధ్య తిరిగే వ్యక్తినని పేర్కొన్నారు. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi

 rajesh pande