
బెంగళూరు, 10 మే (హి.స.)బెంగళూరు పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆదివారం తమిళనాట రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై మండిపడ్డారు. అధికార దాహంతో డీఎంకేను వెన్నుపోటు పొడిచిందని తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్, డీఎంకేల మధ్య 25-30 ఏళ్లుగా పొత్తు ఉంది. 2014కు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ పాలన డీఎంకే వల్లే సాధ్యపడింది. డీఎంకే ఎలప్పుడూ కాంగ్రెస్ మంచి కోసమే పని చేసింది. పలు సందర్భాల్లో చిక్కుల్లో పడ్డ కాంగ్రెస్ను డీఎంకే గట్టెక్కించింది. కాంగ్రెస్ తీరు ప్రస్తుతం పరాన్నజీవిలా మారింది. అవకాశం దొరకగానే మిత్రులను వంచిస్తోంది. కాంగ్రెస్ మనుగడకు మరో పార్టీ అవసరం అవుతోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాలతో అవకాశం రాగానే డీఎంకేకు వెన్నుపోటు పోడిచింది’ అని బెంగళూరులో ర్యాలీ సందర్భంగా ప్రధాని మోదీ మండిపడ్డారు
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi