విజయ్ ప్రమాణ స్వీకారం.. వందేమాతర గేయం ఆరు చరణాలు ఆలపించి..
విజయ్ ప్రమాణ స్వీకారం.. వందేమాతర గేయం ఆరు చరణాలు ఆలపించి..
Vijay


హైదరాబాద్, 10 మే (హి.స.)

తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఇటీవలి కేంద్ర ఉత్తర్వులను పాటించారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి ముందు వేదికపై వందేమాతర గేయాన్ని ఆలపించారు. ఆ తర్వాత 'జనగణమన', 'తమిళ తల్లి' గీతాలను ఆలపించారు

సాధారణంగా అందరూ వందేమాతరంలోని రెండు చరణాలనే ఆలపిస్తారు. అయితే తాజా కార్యక్రమంలో గాయకులు వందేమాతర గేయంలోని ఆరు చరణాలనూ ఆలపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. బంకించంద్ర చటర్టీ 1875లో వందేమాతర గేయాన్ని రచించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం వందేమాతరాన్ని జాతీయ గీతంగా ప్రకటించింది. అయితే వందేమాతరంలోని ఆరు చరణాలు ఉండగా.. వాటిల్లో మత ప్రస్తావన లేని రెండు భాగాలను మాత్రమే అప్పటి ప్రభుత్వం స్వీకరించింది (Vande Mataram full version)

'వందేమాతరం' 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది (Vijay swearing in news). వందేమాతర గేయంలోని ఆరు చరణాలను పాడాలని పేర్కొంది. అన్ని రకాల పౌర పురస్కారాలను ఇచ్చే సమయయంలోనూ, రాష్ట్రపతి హాజరయ్యే అన్ని కార్యక్రమాల్లోనూ వందేమాతరంలోని ఆరు చరణాలను ఆలపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఉత్తర్వులను తమిళనాడు కొత్త ప్రభుత్వం పాటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande