
చెన్నై, 10 మే (హి.స.)
నేడు తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్ఠంభనకు తెరపడింది. తమిళనాడు సీఎంగా చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్తో గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ సీఎంగా ప్రమాణం చేయించారు. విజయ్తో పాటు కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేలా టీవీకే ప్రణాళికలు రూపొందించింది. విజయ్ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరయ్యారు. నాలుగు రోజుల ఉత్కంఠ తర్వాత టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ వీసీకే లేఖ అందించింది. కాసేపటికే ఐఎంయూఎల్ కూడా విజయ్కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐఎంయూఎల్ మద్దతుతో టీవీకే బలం 120కి చేరింది. ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసిన విజయ్ మద్దతు లేఖలు సమర్పించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చిన గవర్నర్, తమిళనాడు సీఎంగా విజయ్ను నియమిస్తూ లేఖ ఇచ్చారు. తమిళనాడులో 70ఏళ్ల తర్వాత డీఎంకే, అన్నాడీఎంకేయేతర ప్రభుత్వం కొలువుదీరుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi